మీ మొదటి కంపోనెంట్
కంపోనెంట్‌లు React యొక్క ప్రధాన కాన్సెప్ట్‌లలో ఒకటి. ఇవి యూజర్ ఇంటర్‌ఫేస్‌లు (UI) నిర్మించే పునాది, అందుకే React ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇవి ఉత్తమమైన ప్రదేశం!
You will learn
- కంపోనెంట్ అంటే ఏమిటి
- React యాప్‌లో కంపోనెంట్‌లు ఏ పాత్ర పోషిస్తాయి
- మీ మొదటి React కంపోనెంట్ రాయడం ఎలా
కంపోనెంట్‌లు: UI బిల్డింగ్ బ్లాక్‌లు
Webలో, HTML దాని అంతర్నిర్మిత

మరియు

వంటి ట్యాగ్‌ల సెట్‌తో రిచ్ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్‌లను రూపొందించడానికి అనుమతిస్తుంది:

My First Component

Components: UI Building Blocks

Defining a Component

Using a Component

ఈ మార్కప్ ఈ ఆర్టికల్

, దాని హెడ్డింగ్

, మరియు ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్

గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలా మార్కప్, CSS స్టైల్ కోసం, మరియు జావాస్క్రిప్ట్ ఇంటరాక్టివిటీ కోసం కలిపి ప్రతి సైడ్‌బార్, అవతార్, మోడల్, డ్రాప్‌డౌన్ వంటి వెబ్‌లో మీరు చూస్తున్న ప్రతి UI భాగం వెనుక ఉంటుంది.
React మీ మార్కప్, CSS, మరియు జావాస్క్రిప్ట్‌ను కస్టమ్ “కంపోనెంట్స్”గా కలిపే అవకాశాన్ని ఇస్తుంది, మీ యాప్‌కు రీయూజబుల్ UI ఎలిమెంట్స్. మీరు పై కోడ్‌ను <TableOfContents />
కంపోనెంట్‌గా మార్చి ప్రతి పేజీలో కూడా రెండర్ చేయవచ్చు. అంతర్గతంగా, ఇది ఇంకా అదే HTML ట్యాగ్లను ఉపయోగిస్తుంది, ఉదాహరణకు

మరియు తదితరాలు.
HTML ట్యాగ్‌లతో చేసినట్లుగా, మీరు కంపోనెంట్స్‌ని కలపడం, ఆర్డర్ చేయడం మరియు నెస్టింగ్ చేయడం ద్వారా పూర్తి పేజీలను డిజైన్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు చదివే డాక్యుమెంటేషన్ పేజీ React కంపోనెంట్స్‌తో తయారైంది:
<PageLayout>
<NavigationHeader>
<SearchBar />
<Link to="/docs">Docs</Link>
</NavigationHeader>
<Sidebar />
<PageContent>
<TableOfContents />
<DocumentationText />
</PageContent>
</PageLayout>
మీ ప్రాజెక్ట్ పెరుగుతున్న కొద్దీ, మీరు ఇప్పటికే రాసిన కంపోనెంట్లను పునర్వినియోగించడం ద్వారా మీ డిజైన్లను రూపొందించవచ్చని గమనిస్తారు, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. మా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పైగా <TableOfContents />
తో ఏ స్క్రీన్‌లోనైనా జోడించవచ్చు! మీరు React ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ద్వారా పంచబడిన వేలాది కంపోనెంట్లను ఉపయోగించి మీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించవచ్చు, ఉదాహరణకు Chakra UI మరియు Material UI.
కంపోనెంట్‌ను నిర్వచించడం
సాంప్రదాయంగా వెబ్ పేజీలను సృష్టిస్తున్నప్పుడు, వెబ్ డెవలపర్లు ముందుగా వారి కంటెంట్‌ను మార్కప్ చేసి, తరువాత కొంచెం జావాస్క్రిప్ట్ జోడించడం ద్వారా ఇంటరాక్షన్‌ను అందించేవారు. ఇది ఇంటరాక్షన్ ఒక అదనపు లక్షణంగా ఉండినప్పుడు బాగా పనిచేసేది. కానీ ఇప్పుడు, ఇది చాలా సైట్లకు మరియు అన్ని యాప్‌లకు అవసరంగా మారింది. React ఇంటరాక్షన్‌ను మొదటి ప్రాధాన్యంగా ఉంచుతుంది, అయినప్పటికీ అదే టెక్నాలజీని ఉపయోగిస్తుంది: React కాంపొనెంట్ అనేది JavaScript ఫంక్షన్, దీనిని మీరు మార్కప్‌తో కలపవచ్చు. ఇది ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఉంది (క్రింది ఉదాహరణను మీరు ఎడిట్ చేయవచ్చు):
export default function Profile() { return (  ) }
ఇదీ ఒక కంపోనెంట్‌ను ఎలా నిర్మించాలో:
స్టెప్ 1: కంపోనెంట్‌ను ఎక్స్‌పోర్ట్ చేయండి
export default
ప్రిఫిక్స్ ఒక స్టాండర్డ్ జావాస్క్రిప్ట్ సింటాక్స్ (React కి ప్రత్యేకం కాదు). ఇది మీరు ఒక ఫైల్‌లో ప్రధాన ఫంక్షన్‌ని మార్క్ చేయడానికి అనుమతిస్తుంది, తద్వారా మీరు ఆ ఫంక్షన్‌ని ఇతర ఫైళ్ల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. (కంపోనెంట్లను ఇంపోర్ట్ చేయడం మరియు ఎక్స్‌పోర్ట్ చేయడం లో మరింత తెలుసుకోండి!)
స్టెప్ 2: ఫంక్షన్ నిర్వచించండి
function Profile() { }
తో మీరు Profile
అనే పేరుతో ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ నిర్వచిస్తారు.
స్టెప్ 3: మార్కప్ జోడించండి
కంపోనెంట్ src
మరియు alt
అట్రిబ్యూట్లతో కూడిన
ట్యాగ్‌ను return చేస్తుంది.
ను HTML లాగా రాస్తారు, కానీ ఇది వాస్తవానికి జావాస్క్రిప్ట్ లో ఉండే కోడ్! ఈ సింటాక్స్‌ను JSX అని పిలుస్తారు, మరియు ఇది జావాస్క్రిప్ట్‌లో మార్కప్‌ను ఎంబెడ్ చేయటానికి అనుమతిస్తుంది.
Return స్టేట్మెంట్‌ను ఈ కంపోనెంట్‌లోని విధంగా ఒకే లైనులో రాయవచ్చు:
return ;
మీ మార్కప్ return
కీవర్డ్‌తో ఒకే లైన్‌లో లేకపోతే, మీరు దాన్ని ఒక జంట పేరెంటీసిస్‌లో చుట్టాలి::
return (

ఒక కంపోనెంట్ ను ఉపయోగించడం
ఇప్పుడు మీరు మీ Profile
కంపోనెంట్‌ను నిర్వచించేసిన తర్వాత, మీరు దీన్ని ఇతర కంపోనెంట్లలో నెస్టు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు అనేక Profile
కంపోనెంట్లను ఉపయోగించే Gallery
కంపోనెంట్‌ను ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు:
function Profile() { return (  ); } export default function Gallery() { return (

Amazing scientists
<Profile /> <Profile /> <Profile />

బ్రౌజర్ ఏమి చూస్తుంది
కేస్‌లో ఉన్న తేడాను గమనించండి:

ఇది చిన్న అక్షరాలలో ఉంది, కాబట్టి Reactకు తెలుసు మనం HTML ట్యాగ్‌ను సూచిస్తున్నాము.<Profile />
ఇది పెద్దP
తో ప్రారంభమవుతుంది, కాబట్టి Reactకు తెలుసు మనంProfile
అనే కాంపొనెంట్‌ను ఉపయోగించాలనుకుంటున్నాము.
మరియు Profile
లో ఇంకా HTML ఉంది:
. చివరికి, బ్రౌజర్ ఇది చూస్తుంది:

Amazing scientists

కంపోనెంట్లను నెస్టింగ్ మరియు ఆర్గనైజ్ చేయడం
కంపోనెంట్లు సాధారణ జావాస్క్రిప్ట్ ఫంక్షన్లు, కాబట్టి మీరు ఒకే ఫైల్‌లో అనేక కంపోనెంట్లను ఉంచవచ్చు. ఇది కంపోనెంనెంట్లు సున్నితంగా చిన్నవిగా లేదా ఒకరికొకటి దగ్గరగా సంబంధం ఉన్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఫైలు చాలా నిండి పోయినప్పుడు, మీరు ఎప్పుడైనా Profile
కంపోనెంట్‌ను ప్రత్యేకమైన ఫైల్‌కు తరలించవచ్చు. మీరు ఈ విధానం గురించి త్వరలో ఇంపోర్ట్స్ పేజీలో నేర్చుకుంటారు.
కారణంగా, Profile
కంపోనెంట్స్ Gallery
లో రేండర్ అవుతున్నాయి—చెప్పాలంటే, అనేకసార్లు!—కాబట్టి మనం చెప్పవచ్చు Gallery
అనేది ఒక పేరెంట్ కంపోనెంట్, మరియు ప్రతి Profile
ను “చైల్డ్” గా రేండర్ చేస్తుంది. ఇది React యొక్క మ్యాజిక్ భాగం: మీరు ఒక కంపోనెంట్ని ఒకసారి డిఫైన్ చేసి, అప్పుడు దాన్ని మీరు ఇష్టపడే ఎన్ని ప్రదేశాల్లోనూ, ఎన్ని సార్లు అయినా ఉపయోగించవచ్చు.
Deep Dive
మీ React అప్లికేషన్ ఒక “రూట్” కంపోనెంట్‌తో ప్రారంభం అవుతుంది. సాధారణంగా, మీరు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేపుడు ఇది ఆటోమాటిక్‌గా సృష్టించబడుతుంది. ఉదాహరణకు, మీరు CodeSandbox లేదా Next.js ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగిస్తే, రూట్ కంపోనెంట్ pages/index.js
లో నిర్వచించబడుతుంది. ఈ ఉదాహరణల్లో, మీరు రూట్ కంపోనెంట్లను ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు.
మొత్తం React యాప్స్ కంపోనెంట్స్‌ను అన్ని దారిలో ఉపయోగిస్తాయి. అంటే, మీరు కేవలం రీయూజబుల్ భాగాలు, ఉదాహరణకు బటన్‌లతో మాత్రమే కంపోనెంట్స్‌ను ఉపయోగించరు, కానీ పెద్ద భాగాలు, ఉదాహరణకు సైడ్‌బార్లు, జాబితాలు, మరియు చివరగా, పూర్తి పేజీలు కూడా! కంపోనెంట్స్ UI కోడ్ మరియు మార్కప్‌ను వ్యవస్థీకరించడానికి చాలా ఉపయోగకరమైన మార్గం, కొన్నిటిని ఒకసారి మాత్రమే ఉపయోగించినా.
React ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌లు ఈ దశను మరింత ముందుకు తీసుకుంటాయి. ఒక ఖాళీ HTML ఫైల్‌ను ఉపయోగించి, React “పేజీని నిర్వహించేందుకు” జావాస్క్రిప్ట్‌తో పేజీని నిర్వహించడానికి అనుమతించే బదులుగా, అవి మీ రియాక్ట్ కాంపొనెంట్ల నుండి HTMLని ఆటోమేటిగ్గా జనరేట్ చేస్తాయి. ఇది జావాస్క్రిప్ట్ కోడ్ లోడ్ అవకముందు మీ యాప్ కొన్ని కంటెంట్‌ను చూపించడానికి అనుమతిస్తుంది.
అయితే, అనేక వెబ్‌సైట్లు Reactని కేవలం మొదలైన HTML పేజీలకు ఇంటరాక్టివిటీ జోడించడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. అవి పేజీ మొత్తం కోసం ఒకే ఒక రూట్ కాంపొనెంట్ యొక్క స్థానంలో అనేక రూట్ కాంపొనెంట్లను కలిగి ఉంటాయి. మీరు ఎంత React ఉపయోగించాలనుకుంటే, అంతా లేదా కొంత React ఉపయోగించవచ్చు.
Recap
మీరు React ను మొదటి సారి అనుభవించారు! కొన్ని ముఖ్యమైన అంశాలను పునరావలంబం చేద్దాం.

React మీకు మీ యాప్ కోసం రీయూజబుల్ UI ఎలిమెంట్స్ అయిన కంపోనెంట్లను సృష్టించడానికి అనుమతిస్తుంది.

React యాప్‌లో ప్రతి UI భాగం ఒక కంపోనెంట్.

React కంపోనెంట్లు సాధారణ జావాస్క్రిప్ట్ ఫంక్షన్లు అయినప్పటికీ:
- వాటి పేర్లు ఎల్లప్పుడూ పెద్ద అక్షరంతో ప్రారంభం అవుతాయి.
- అవి JSX మార్కప్‌ను return ఇస్తాయీ.
Challenge 1 of 4: కంపోనెంట్‌ను ఎక్స్‌పోర్ట్ చేయండి
ఈ శాండ్‌బాక్స్ పని చేయడం లేదు, ఎందుకంటే రూట్ కంపోనెంట్ ఎక్స్‌పోర్ట్ చేయబడలేదు:
function Profile() { return (  ); }
పరిష్కారాన్ని చూడటానికి ముందు దానిని మీరు స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించండి!